హైకోర్టులో ఫైర్ మాక్ డ్రిల్‌

హైకోర్టులో ఫైర్ మాక్ డ్రిల్‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఆపరేషన్‌‌ అభ్యాస్‌‌ మాక్‌‌ డ్రిల్స్‌‌లో భాగంగా రాష్ట్ర ఫైర్ సర్విసెస్ డిపార్ట్‌‌మెంట్‌‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం హైకోర్టులో ఫైర్‌‌‌‌ మాక్ డ్రిల్ నిర్వహించింది. అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో మంటలను ఎలా అదుపు చేయాలి.. బాధితులను ఎలా కాపాడాలనే అంశాలపై ఉద్యోగులు, విజిటర్లలో అవగాహన కల్పించారు. హైకోర్టు ఎలక్ట్రిసిటీ సిబ్బంది, స్పెషల్ పోలీస్ ఫోర్స్, మెడికల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్నిమాపక పరికరాలను వినియోగించే విధానాన్ని తెలుసుకున్నారు.